Home » China
గత కొన్నేళ్లుగా చైనాలో జనాభా నియంత్రణను చాలా కఠినంగా అమలు చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత శాతం బాగా పడిపోయింది. దీంతో చైనాలో కొంత కాలంగా మానవ వనరుల సంక్షోభం నెలకొంది. దీంతో చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది.
ఓ 21 ఏళ్ల కాలేజ్ విద్యార్థి పలువురిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ విషాధ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
చైనాలో ఓ యువకుడు కత్తితో కళాశాల క్యాంప్సలోకి ప్రవేశించి స్వైరవిహారం చేశాడు. విద్యార్థులపై విక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
‘‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ’’.. ఎప్పుడో విమానాలు లేని రోజుల్లో, 1872లో ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత జూల్స్వెర్న్ రాసిన కాల్పనిక నవల పేరు ఇది! ఆయన ఆ నవల రాసిన వందేళ్ల తర్వాత.. శబ్దం కన్నా ఎక్కువ వేగంతో (సూపర్సానిక్) ప్రయాణించే కంకార్డ్ విమానాలు గాల్లో ఎగిరాయి.
దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ప్రతిష్ఠంభన తర్వాత తొలిసారి భారత్ - చైనా సరిహద్దులో పెట్రోలింగ్ ప్రారంభమైంది. భారత్, చైనా బలగాలను ఉపయోగించుకోవడంతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి కీలకమైన పాయింట్లలో ఒకటైన డెప్సాంగ్ వద్ద భారత సైన్యం సోమవారం తిరిగి పెట్రోలింగ్ ప్రారంభించింది.
చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్కు చెందిన వాంగ్.. వేల ఫోన్లను నకిలీ వీక్షకులతోపాటు లైవ్ స్ట్రీమ్లలో ట్రాఫిక్కు ఉపయోగించాడు. తద్వారా నాలుగు నెలల కంటే తక్కువ వ్యవధిలో రూ.3.4 కోట్లు సంపాదించాడు. దీంతో అతడు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ కేసులో అతడికి 15 నెలల జైలు శిక్ష విధించడంతోపాటు రూ.7 వేల యూఎస్ డాలర్ల జరిమానా సైతం విధించారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.
భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడబోమని ఆయన వ్యాఖ్యానించారు.
గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగేళ్ల పాటు సరిహద్దులో కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే ముగింపుపడిన విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం కుదుర్చుకున్నాయి.
ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
తూర్పు లడఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్లో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. ఈ విషయాన్ని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ పెట్రోలింగ్ త్వరలో పున: ప్రారంభమవుతుందని సైనిక అధికారులు..