Cylinder Blast: పెళ్లి విందులో విషాదం...పేలిన సిలిండర్లు...
ABN , First Publish Date - 2022-12-09T09:53:20+05:30 IST
ఓ పెళ్లి విందులో విషాదం అలముకుంది.పెళ్లి విందు కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలో నలుగురు మరణించగా...
నలుగురి మృతి, 50మందికి గాయాలు
జోధ్‌పూర్ (రాజస్థాన్): ఓ పెళ్లి విందులో విషాదం అలముకుంది.పెళ్లి విందు కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలో నలుగురు మరణించగా, 50 మంది గాయపడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ నగరంలో జరిగింది.(Cylinder Blast)భుంగ్రా గ్రామంలో((Rajasthan Village) జరిగిన సిలిండర్ల పేలుడులో నలుగురు మరణించగా 50మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎంజీహెచ్ ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.