అద్దాల వంతెన ప్రత్యేక ఆకర్షణ

ABN , First Publish Date - 2022-03-12T13:40:29+05:30 IST

స్థానిక విల్లివాక్కం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ చెరువుపై సింగపూరు తరహాలో ఓ పొడవైన అద్దాల కాలిబాట వంతెనను నిర్మిస్తున్నారు. ఆ వంతెన మీదుగా

అద్దాల వంతెన ప్రత్యేక ఆకర్షణ

                  - విల్లివాక్కంలో పర్యాటకుల కోసం నెలరోజుల్లో సిద్ధం


చెన్నై: స్థానిక విల్లివాక్కం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ చెరువుపై సింగపూరు తరహాలో ఓ పొడవైన అద్దాల కాలిబాట వంతెనను నిర్మిస్తున్నారు. ఆ వంతెన మీదుగా పర్యాటకులు నడుస్తుంటే నీటిపై నడిచే వింత అనుభూతిని పొందుతారని ప్రజాపనులశాఖ అధికారులు తెలిపారు. సుమారు 27.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ చెరువు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందనున్నదని తెలిపారు. చిన్నారులకు ఆటస్థలం, చిన్నా పెద్దలకు బోట్‌సఫారీ, ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, జిమ్‌, ఆవిన్‌ విక్రయ కేంద్రం, పార్కులు, రెస్టారెంట్లు, వందకు పైగా వాహనాలు నిలిపేందుకు అనువైన పార్కింగ్‌ స్థలం వంటి హంగులతో ఈ చెరువు ప్రాంతం చూపరులకు కనువిందు చేయనుంది. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న అద్దాల కాలినడక వంతెన పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రస్తుతం చివరి దశ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే నెలలోగా ఈ పర్యాటక ప్రాంతం ప్రారంభం కానున్నదని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-12T13:40:29+05:30 IST