Himanta Biswa Sarma : ఎంపీ అజ్మల్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-06T07:54:56+05:30 IST

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Himanta Biswa Sarma : ఎంపీ అజ్మల్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం
Himanta Biswa Sarma slams Ajmal

గౌహతి (అసోం): హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.(Himanta Biswa Sarma) అజ్మల్ వ్యాఖ్యానించినట్లు తల్లి గర్భాన్ని వ్యవసాయ భూమిగా చూడలేమని సీఎం చెప్పారు. ఎక్కువమంది పిల్లల్ని కనమని అజ్మల్ కోరడం ముస్లిం మహిళలను వంచించడమేనని సీఎం వ్యాఖ్యానించారు. బొంగైగావ్‌లో జరిగిన బహిరంగ సభలో అజ్మల్ వ్యాఖ్యలకు సీఎం శర్మ సమాధానమిచ్చారు.

ముస్లిం మహిళలు వారి పిల్లలకు మంచి విద్యను అందించడానికి వారి కుటుంబాలను ఇద్దరు పిల్లలకే పరిమితం చేయాలని సీఎం కోరారు.‘‘మీ ఓట్లు నాకు అవసరం లేదు, కానీ అజ్మల్ మాట వినవద్దు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనకండి, తద్వారా మీరు పిల్లల్ని అగ్రశ్రేణి క్రీడాకారులు, డాక్టర్లు,ఇంజనీర్లుగా పెంచవచ్చు’’ అని ముస్లిం మహిళలను ఉద్దేశించి సీఎం శర్మ అన్నారు.

మహిళలను పిల్లలను కనే కర్మాగారాలు అని నమ్మించడానికి అజ్మల్ ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు. ‘‘మా హిందూ మహిళలు ఎంత మంది పిల్లలను కనాలి అని చెప్పే హక్కు అజ్మల్‌కు లేదన్నారు. పిల్లల పెంపకం కోసం డబ్బు చెల్లించడానికి అజ్మల్ సిద్ధంగా ఉంటే తాను కూడా 10 మంది పిల్లల్ని కనమని ప్రజలను కోరతానని సీఎం వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-06T07:54:58+05:30 IST