Gujarat Elections 2022: గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను: మోదీ

ABN , First Publish Date - 2022-11-06T17:50:03+05:30 IST

వల్సద్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్ రాష్ట్రంలో ఆదివారంనాడు పర్యటించిన ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త నినాదం ఎత్తుకున్నారు. ''గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను'' అని వల్సాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన నినదించారు. గుజరాత్ నిరంతర అభివృద్ధికి..

Gujarat Elections 2022: గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను: మోదీ

వల్సద్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్ రాష్ట్రంలో ఆదివారంనాడు పర్యటించిన ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త నినాదం ఎత్తుకున్నారు. ''గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను'' అని వల్సాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన నినదించారు. గుజరాత్ నిరంతర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని, ప్రతి గుజరాతీ ఆత్మవిశ్వాసంతో

ఉన్నారని, గుజరాత్ అభివృద్ధి వారి మనస్సుల్లో ప్రతిధ్వనిస్తోందని అన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత తొలిసారి స్వరాష్ట్రంలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ, తన ప్రసంగంలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు. విద్వేష వ్యాప్తి ద్వారా గుజరాత్‌ ప్రతిష్టను దెబ్బతీసి, అవమానించేందుకు ప్రయత్నిస్తున్న విభజన శక్తులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గత ఎన్నికల ఫలితాలనే ఆ శక్తులు చవిచూస్తాయని జోస్యం చెప్పారు.

''ఢిల్లీలో ఉండి సేకరించిన సమాచారం ప్రకారం ఈసారి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయి మార్జిన్‌లో విజయం సాధించనుంది. బీజేపీ గతంలో సాధించిన రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త విక్టరీ మార్జిన్ కోసం నేను ఇక్కడకు వచ్చాను. ప్రచారానికి సాధ్యమైనంత సమయాన్ని వెచ్చిండడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీకి కూడా చెప్పాను'' అని మోదీ అన్నారు.

కాగా, డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతలుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ జరుగుతుంది. 2017 ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం బరిలోకి దిగడంతో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

Updated Date - 2022-11-06T17:50:05+05:30 IST