Isha Ambani: సంతోషంలో ముకేష్ అంబానీ కుటుంబం.. దానికి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-20T18:14:16+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (reliance industries limited) అధినేత, భారత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) కుటుంబంలో కవలలు అడుగుపెట్టారు.

Isha Ambani: సంతోషంలో ముకేష్ అంబానీ కుటుంబం.. దానికి కారణం ఏంటంటే..

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (reliance industries limited) అధినేత, భారత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) కుటుంబంలో కవల పిల్లలు అడుగుపెట్టారు. ముకేష్ అంబానీ కూతురు-అల్లుడు ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్ (Isha Ambani - Anand Piramal) తల్లిదండ్రులయ్యారు. ఆదివారం ఒక ఆడ, ఒక మగ శిశువులకు ఇషా జన్మనిచ్చారు. వారికి ఆదియా, క్రిష్ణ అని పేర్లు పెట్టారు.

తమ కుటుంబంలో కొత్తగా ఇద్దరు సభ్యులు తోడైన ఈ శుభపరిణామంపై ముకేష్ అంబానీ కుటుంబం ప్రకటన చేసింది. ‘‘ మా పిల్లలు ఇషా, ఆనంద్‌లు దేవుడి అనుగ్రహంతో నవంబర్ 19, 2022న కవలలకు జన్మనిచ్చారని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇషా, పిల్లలు బేబీ గర్ల్ ఆదియా (Aadiya), బేబీ బాయ్ క్రిష్ణ (Krishna) ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆశీర్వాదాలు కోరుతున్నాం. జీవితంలో అతి ముఖ్యమైన దశలో ఉన్న ఇషా-ఆనంద్ దంపతులు, వారి పిల్లలు ఆదియా, క్రిష్ణలకు మీ విషెస్ తెలియజేయండి’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా ముకేష్ అంబానీ-నీతా అంబానీల ముద్దుల కూతురు ఇషా అంబానీ, అజయ్ పిరమాల్-స్వాతి పిరమాల్ దంపతుల కొడుకు ఆనంద్ పిరమాల్ ఇద్దరికీ 2018లో పెళ్లైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-20T18:18:00+05:30 IST