రికార్డు సృష్టించిన Kattupalli ఓడరేవు
ABN , First Publish Date - 2022-05-20T15:51:11+05:30 IST
దేశ నౌకా వాణిజ్య చరిత్రలో తిరువళ్లూర్ జిల్లాలోని కాట్టుపల్లి ఓడరేవు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోనో టెక్నాలజీతో డిజైన్ చేసిన 450 వాట్స్ సామర్థ్యం కలిగిన పవర్ గ్రిడ్
ప్యారీస్(చెన్నై): దేశ నౌకా వాణిజ్య చరిత్రలో తిరువళ్లూర్ జిల్లాలోని కాట్టుపల్లి ఓడరేవు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోనో టెక్నాలజీతో డిజైన్ చేసిన 450 వాట్స్ సామర్థ్యం కలిగిన పవర్ గ్రిడ్ సోలార్ జనరేషన్ ప్లాంట్ను నిర్మించింది. ఈ సోలార్ ప్లాంట్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా పనిచేసేలా డిజైన్ చేశారు. పోర్టు చుట్టుపక్కల 30 కి.మీ వరకు వాయుకాలుష్యాన్ని వ్యాపింపజేయకుండా ఈ ప్లాంట్ పనిచేస్తుందని, కాట్టుపల్లి ఓడరేవు, అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్ సంస్థలు సంయుక్తంగా దేశంలోని ఓడరేవుల్లో మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని చేపట్టి రికార్డు నెలకొల్పినట్లు పోర్టు అధికారులు తెలిపారు.