Ghazal Srinivasకు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్
ABN , First Publish Date - 2022-09-29T19:55:46+05:30 IST
గిన్నిస్ వరల్డ్ రికార్డుల (Guinness World Records) గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas)కు అరుదైన గౌరవం దక్కింది.
Pune : గిన్నిస్ వరల్డ్ రికార్డుల (Guinness World Records) గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas)కు అరుదైన గౌరవం దక్కింది. ‘భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర (My Home India Maharashtra), ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది. పుణే నగరంలో శ్రీ యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియంలో వేలాది మంది సమక్షంలో గజల్ శ్రీనివాస్‌కు విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే (Prashant Damle) ఈ అవార్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సునీల్ దేవదర్ (Sunil Deodar) అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డా.గజల్ శ్రీనివాస్.. లతా మంగేష్కర్‌పై రాజేంద్ర నాథ్ రెహబర్ (Rajendra Nath Rehabar), కల్నల్ తిలక్ రాజ్ (Colonel Tilak Raj), రవికాంత్ అన్మోల్ (Ravikant Anmol) రచించిన హిందీ, ఉర్దూ గజల్స్‌ను గానం చేసి ఆమెకు గాన నీరాజనం అందజేశారు.