Marina Beach: మెరీనాలో దివ్యాంగుల కోసం ప్రత్యేక రహదారి

ABN , First Publish Date - 2022-11-05T10:47:35+05:30 IST

స్థానిక మెరీనాబీచ్‌(Marina Beach)లో దివ్యాంగులు, వృద్ధులు సముద్రతీరానికి సులువుగా నడిచి వెళ్లేందుకు కొయ్యపలకలతో నిర్మించిన తాత్కాలికి

Marina Beach: మెరీనాలో దివ్యాంగుల కోసం ప్రత్యేక రహదారి

చెన్నై, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెరీనాబీచ్‌(Marina Beach)లో దివ్యాంగులు, వృద్ధులు సముద్రతీరానికి సులువుగా నడిచి వెళ్లేందుకు కొయ్యపలకలతో నిర్మించిన తాత్కాలికి రహదారికి మంచి స్పందన లభించింది. వివేకానందర్‌ ఇల్లమ్‌ ఎదురుగా తీరం వరకూ ఇసుకపె కొయ్యలు పరచి ఈ తాత్కాలిక కాలినడక రహదారిని ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులే కాకుండా చిన్నారులు కూడా ఈ మార్గంలో వెళ్ళి సముద్రతీరానికి వెళ్తున్నారు. దీంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు ఈ కొయ్య పలకల రహదారిని శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-11-05T10:47:37+05:30 IST