Mask: ఇక మాస్కులు తప్పనిసరి...

ABN , First Publish Date - 2022-12-24T10:59:05+05:30 IST

కొవిడ్‌ భయం మరోసారి వచ్చేస్తోంది. చైనాలో తీవ్ర రూపం దాల్చిన మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం

Mask: ఇక మాస్కులు తప్పనిసరి...

- బెంగళూరులో 440 మంది మార్షల్స్‌ ప్రచారం

బెంగళూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ భయం మరోసారి వచ్చేస్తోంది. చైనాలో తీవ్ర రూపం దాల్చిన మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దేశప్రజలకు కొవిడ్‌ పట్ల జాగ్రత్తలు అవసరమేనని సూచించిన వెంటనే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. ప్రతి చోటా మాస్కులు తప్పనిసరిగా వాడటం ఉత్తమమని మార్షల్స్‌ శుక్రవారం నుంచి ప్రచారాలకు దిగారు. బెంగళూరు(Bengaluru) నగర వ్యాప్తంగా 440 మంది మార్షల్స్‌ ప్రాంతాల వారిగా ప్రచారాలకు దిగారు. జరిమానాలు విధించకుండా మాస్కులు వాడాలను సూచిస్తున్నారు. ఇక మెట్రోరైలులో ప్రయాణాలకు మాస్కులు తప్పనిసరి చేశారు. మాస్కు లేకుంటే ప్రవేశంలోనే వాపసు పంపుతున్నారు. శనివారం నుంచి బీఎంటీసీ బస్సుల్లో మాస్కు నిబంధనలు పాటించేలా ప్రయాణికులకు సూచిస్తున్నారు. మరో వైపు అన్ని విద్యాసంస్థల్లోను కొవిడ్‌ ఆంక్షలు పాటించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సహా అందరూ మాస్కులు ధరించాలని ప్రాంతీయ విద్యాధికారులు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల సంఘాలు ఇవే అదేశాలను పాటించేలా ఆదేశించారు. ప్రస్తుతం పలు ప్రైవేటు విద్యాసంస్థలకు క్రిస్‌మస్‌ సెలవులు కావడంతో కలిసివచ్చినట్లయింది. యూనివర్సిటీలు, కళాశాల్లోనూ మాస్కులు ధరించేలా నోటీసు బోర్డుల వద్ద ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలు అమలుకై జి ల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2022-12-24T10:59:07+05:30 IST