Milk: లీటరుకు రూ.3.. పెరగనున్న పాలధర
ABN , First Publish Date - 2022-11-15T11:53:54+05:30 IST
కొవిడ్ అనంతరం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలపై పాల ధర(milk price)ల పెంపు రూపంలో మరో
- అధికారులతో చర్చించి నిర్ణయం: సీఎం
బెంగళూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ అనంతరం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలపై పాల ధర(milk price)ల పెంపు రూపంలో మరో భారం పడనుంది. కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) నిర్వహణలోని డెయిరీల ద్వారా సరఫరా అయ్యే నందిని పాల ధరను లీటరు రూ.37 నుంచి 40కు పెంచాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాలధరలు పెంచాలంటూ కేఎంఎఫ్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. పశుగ్రాసం, దాణా ఖర్చులతో పాటు నిర్వహణా వ్యయం పెరగడంతో కేఎంఎఫ్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పాలధరను స్వల్పంగా పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేఎంఎఫ్ అధ్యక్షుడు బాలచంద్ర జార్కిహొళి(KMF President Balachandra Jarkiholi) సోమవారం మీడియాకు తెలిపారు. పాలధర పెంపుతో పాడిరైతులకు కూడా లబ్ధి చేకూరనుందన్నారు. కాగా స్పెషల్ పాలధర రూ.43 నుంచి 46కు పెరగనుండగా, వెన్నతో కూడిన పాలధర లీటరు రూ.48 నుంచి రూ.51కు పెరగనుంది. పాలధర పెంపు కథనాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కలబురగిలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలధర పెంపుపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని, 20న పాల సమాఖ్య అధికారులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.