Home Minister Narottam Mishra: షారూఖ్,అమీర్ ఖాన్ పూజలపై హోంశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-14T08:29:23+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ పూజలు చేయడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా సంచలన వ్యాఖ్యలు ....
భోపాల్ (మధ్యప్రదేశ్): బాలీవుడ్ ప్రముఖ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ పూజలు చేయడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘సమాజానికి ఇప్పుడు అవగాహన వచ్చింది. ఈ విషయం ఇప్పుడు అర్థం చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరికి వారి నమ్మకం ప్రకారం పూజించే హక్కు ఉంది. ఎవరైనా ఏ దేవుడిని అయినా పూజించవచ్చు. ఇతరుల విశ్వాసాన్ని దెబ్బతీయవద్దు అంతే’’ అని నరోత్తం(Madhya Pradesh home minister Narottam Mishra) అన్నారు. అమీర్ ఖాన్ తన కార్యాలయంలో పూజలు చేయడం(Aamir Khan Kalash puja), షారూఖ్ ఖాన్ వైష్ణో దేవిని దర్శించుకోవడంపై (SRK's Vaishno Devi visit)మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఖాన్ లపై బహిష్కరణ పిలుపునిచ్చిన ఫైర్ బ్రాండ్ మంత్రి నరోత్తం తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.కొన్ని నెలల క్రితం అమీర్ ఖాన్, కియారా అద్వానీని కొత్త జంటగా చూపించిన బ్యాంక్ ప్రకటనపై నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు, దేవతలకు సంబంధించిన విషయాలపై అమీర్ ఖాన్ నుంచి ప్రకటనలు వస్తూనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఎవరి మనోభావాలను దెబ్బతీసేందుకు అమీర్ ఖాన్ కు అనుమతి లేదని నేను నమ్ముతున్నాను’’ అని మిశ్రా అన్నారు.ఇటీవల అమీర్ ఖాన్ తన ప్రొడక్షన్ కార్యాలయంలో కలశ పూజ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా నెటిజన్లు అతని విశ్వాసం గురించి ప్రశ్నలను లేవనెత్తారు. షారుక్ ఖాన్ ఇటీవల జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.