MLA: మాజీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే పాదాభివందనం

ABN , First Publish Date - 2022-12-20T07:49:16+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswa

MLA: మాజీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే పాదాభివందనం

చెన్నై, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)కి పీఎంకే శాసనసభ్యుడు అరుళ్‌ పాదాభివందనం చేయడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. సేలం మకుడంచావిడి ప్రాంతంలో నిర్మితమైన కబడ్డీ ఇండోర్‌ స్టేడియంను ఈపీఎస్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసే సమయంలో సేలం వెస్ట్‌ నియోజకవర్గం పీఎంకే శాసనసభ్యుడు అరుళ్‌ వచ్చి ఈపీఎస్(EPS)కు పాదాభివందనం చేశారు. అయితే పీఎంకే శాసనసభ్యుడు తన కాలికి మొక్కడాన్ని ఈపీఎస్‌ పెద్దగా గమనించలేదు. ఈపీఎస్‌ తనను గమనించలేదన్న విషయం గ్రహించిన అరుళ్‌ చివరగా ఆయన దృష్టిలోపడేలా కుడివైపు నిలబడ్డారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహక కమిటీ తరఫున పీఎంకే శాసనసభ్యుడిని సత్కరించాలని ఈపీఎస్‌ ప్రకటించగానే స్థానిక ప్రముఖులు శాలువతో సత్కరించారు. అయితే పీఎంకేకు చెందిన ఎమ్మెల్యే అన్నాడీఎంకే అధినేత కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - 2022-12-20T07:49:17+05:30 IST