Muruga Mutt Shivamurthy: చాక్లెట్లు, డ్రైఫ్రూట్లు ఇచ్చి అత్యాచారం చేశాడు
ABN , First Publish Date - 2022-11-14T12:17:57+05:30 IST
మురుగ మఠం లింగాయత్ స్వామి శివమూర్తి లీలలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి.మఠంలో అందరూ నిద్రించిన తర్వాత...
చార్జ్ షీటులో బాలికల సంచలన విషయాలు
బెంగళూరు: మురుగ మఠం లింగాయత్ స్వామి శివమూర్తి లీలలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి.మఠంలో అందరూ నిద్రించిన తర్వాత 64 ఏళ్ల స్వామిజీ (Shivamurthy Murugha Sharanaru)మైనర్ బాలికలను తన గదికి (Room) పిలిపించుకొని వారికి చాక్లెట్లు, డ్రైఫ్రూట్లు ఇచ్చి అత్యాచారం చేశాడని ఇద్దరు బాలికలు చెప్పినట్లు చార్జ్ షీటులో వెల్లడైంది.(Charge Sheet) ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం స్వామిజీ(Muruga Mutt seer) లీలలపై 694 పేజీల ఛార్జిషీటును జిల్లా రెండవ అదనపు సెషన్స్ కోర్టులో సమర్పించారు. ప్రతీరోజూ రాత్రి స్వామిజీ తనను గదికి పిలిపించి తన ప్రైవేటు భాగాలను చేతులతో తడిమి అత్యాచారం చేసి తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి హాస్టల్ కు పంపిచేవాడని బాధిత బాలిక పేర్కొంది.
తన అమ్మ 2012వ సంవత్సరంలో మరణించడంతో తాను 7వతరగతి చదువుతూ మురుగమఠంలోని ప్రియదర్శిని హైస్కూల్ ల చేరానని బాధిత బాలిక పేర్కొంది. రష్మీ హాస్టల్ వార్డెన్ గా వచ్చాక తమను స్వామిజీ(Muruga Mutt Shivamurthy) లైంగికంగా వేధింపులు ప్రారంభం అయ్యాయని బాలిక తెలిపింది.
రాత్రి 9 గంటలకు తనను వార్డెన్ రష్మీ మరో అమ్మాయితో కలిసి రెండు మూడుసార్లు స్వామిజీ గదిలోకి పంపించిందని పేర్కొంది. స్వామిజీ తనకు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు ఇచ్చి, తన బట్టలు తీసి, స్వామి కూడా తన బట్టలు తీసి ఒడిలో కూర్చోపెట్టుకొని తన ప్రైవేటు భాగాలను తాకేవాడని బాలిక తెలిపింది. ఆపై తనపై అత్యాచారం చేసేవాడని బాధిత బాలిక వివరించింది. స్వామిజీ లీలలు ఛార్జిషీటులో వెలుగుచూసిన అంశాలు రోజుకొకటి వెలుగుచూడటం సంచలనం రేపాయి.