మణిపూర్‌లో విద్యార్థినులతో వెళుతున్న బస్సు బోల్తా.. 15 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-12-21T16:42:49+05:30 IST

నగరంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది.

మణిపూర్‌లో విద్యార్థినులతో వెళుతున్న బస్సు బోల్తా.. 15 మంది దుర్మరణం

మణిపూర్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి బస్సు బయలుదేరింది. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చనిపోయిన వారంతా అమ్మాయిలే కావడం శోచనీయం. విద్యార్థినులతో వెళుతున్న బస్సు బోల్తా పడటం గమనార్హం.

Updated Date - 2022-12-21T17:41:15+05:30 IST