ఇక కరోనా భయం లేదు!

ABN , First Publish Date - 2022-11-19T02:25:15+05:30 IST

గత ఏడాది కాలంలో కొత్త వేరియెంట్లేవీ బయటపడని నేపథ్యంలో కొవిడ్‌-19 గురించి ఇక భయాలు అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) పరిశోధకుడు డాక్టర్‌ రమణ్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు.

ఇక కరోనా భయం లేదు!

న్యూఢిల్లీ, నవంబరు 18: గత ఏడాది కాలంలో కొత్త వేరియెంట్లేవీ బయటపడని నేపథ్యంలో కొవిడ్‌-19 గురించి ఇక భయాలు అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) పరిశోధకుడు డాక్టర్‌ రమణ్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. గతంలో ప్రతి 6 నెలలకు ఒక వేరియెంట్‌ వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘గత ఏడాది ఒమైక్రాన్‌ అనంతరం తిరిగి మరో వేరియెంట్‌ ఏదీ రాలేదు. ఒమైక్రాన్‌ మాత్రమే కొనసాగుతోంది. ఇంత వ్యవధి తర్వాత కొత్తగా మరో వేరియెంట్‌ వచ్చే అవకాశం ఇక లేదు. తొలిగా బయటపడిన వూహాన్‌ వైరస్‌, ఆ తర్వాత 37 మార్లు ఉత్పరివర్తన చెందింది. ప్రస్తుతం ఒమైక్రాన్‌ ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక కరోనా భయం అవసరం లేదనేది నా అభిప్రాయం. అయినప్పటికీ మాస్కును ధరించడం సురక్షితం.’’ అని రమణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-19T02:25:16+05:30 IST