Ooty Train: ఊటీ రైలు సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-20T10:13:02+05:30 IST
నీలగిరి(Nilgiris) జిల్లా మేట్టుపాళయం నుంచి కొండ రైలు సేవలు సోమవారం ప్రారంభం కావడంతో
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 19: నీలగిరి(Nilgiris) జిల్లా మేట్టుపాళయం నుంచి కొండ రైలు సేవలు సోమవారం ప్రారంభం కావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కున్నూర్ అటవీ ప్రాంతంలో కురిసిన భారీవర్షాల కారణంగా రైలు పట్టాలపై మటిచెరియలు, బండరాళ్లు పడడంతో ఈ నెల 13 నుంచి కొండ రైలు సేవలు రద్దు చేశారు. రైల్వే కార్మికులు రైలు పట్టాలపై పడిన రాళ్లు, మట్టి చెరియలు తొలగించడంతో, ఐదు రోజుల అనంతరం ఆదివారం ఉదయం 7.10 గంటల ప్రాంతంలో 180 మంది ప్రయాణికులతో మేట్టుపాళయం నుంచి కొండ రైలు ఊటీకి బయల్దేరి వెళ్లింది.