Pamban Bridge: 10వరకు పాంబన్‌పై రైళ్ల రాకపోకలు బంద్‌

ABN , First Publish Date - 2022-12-31T08:33:10+05:30 IST

మరమ్మతుల కారణంగా పాంబన్‌ వంతెన(Pamban Bridge)పై జనవరి 10వ తేది వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

Pamban Bridge: 10వరకు పాంబన్‌పై రైళ్ల రాకపోకలు బంద్‌

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 30: మరమ్మతుల కారణంగా పాంబన్‌ వంతెన(Pamban Bridge)పై జనవరి 10వ తేది వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఈ నెల 23వ తేదీ వంతెనపై రైళ్లు వెళ్లే సమయంలో అధిక ప్రకంపనలు రావడం అధికారులు గుర్తించి, మరమ్మతులు చేపట్టారు. తొలుత ఈ నెల 31వ తేది వరకు వంతెనై రైళ్ల రాకపోకలు నిలిపివేయగా, మరమ్మతులు పూర్తికాకపోవడంతో జనవరి 10వ తేది వరకు రాకపోకలు నిలిపివేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-12-31T08:33:12+05:30 IST