Police: అన్నామలై ఆరోపణలు అవాస్తవం : పోలీసు శాఖ

ABN , First Publish Date - 2022-10-30T10:53:24+05:30 IST

Police: Annamalai allegations are untrue: Police Department బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపణలు అవాస్తవాలని పోలీసు శాఖ ఒక ప్రకటనలో

Police: అన్నామలై ఆరోపణలు అవాస్తవం : పోలీసు శాఖ

చెన్నై, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపణలు అవాస్తవాలని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలో విలేఖరులతో మాట్లాడిన అన్నామలై, కోవై కారు పేలుడు గురించి కేంద్ర హోంశాఖ ముందుగానే హెచ్చరిస్తూ రాష్ట్ర పోలీసు శాఖకు లేఖ రాసిందని, ఆ లేఖ తన వద్ద ఉందని పేర్కొన్నారు. అన్నామలై ఆరోపణలపై స్పందించిన పోలీసు శాఖ, కేంద్ర హోంశాఖ నుండి అందిన లేఖ సాధారణ సర్క్యులర్‌ మాత్రమేనని, ఆ లేఖలో కోవై పేలుళ్ల ఘటనకు సంబంధించిన అంశాలు లేవన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే విచారణ చేపట్టడం, కేసు నమోదుచేయడం రాష్ట్ర పోలీసుల బాధ్యత అన్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధానం పాటిస్తున్నాయని అన్నారు. కోవై కారు పేలుళ్లలపై ఎన్‌ఐఏ విచారించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister of the State) సిఫారసు చేశారని పేర్కొంది. ఈ ఘటనపై ఆయన పేర్కొంటున్న అవాస్తవాలు విచారణ పక్కదోవ పట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అవాస్తవాలు ప్రకటించి రాష్ట్ర పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.

Updated Date - 2022-10-30T10:58:40+05:30 IST