పంజాబీ నటుడు దీప్ సిద్ధూ హఠాన్మరణం
ABN , First Publish Date - 2022-02-16T06:37:40+05:30 IST
పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిధ్ధూ(37)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 : పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిధ్ధూ(37) మంగళవారం హఠాన్మరణం పొందారు. హరియాణాలోని ఖార్‌కోడా ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీప్ సిద్ధూ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. కాగా, కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లతో దీప్ సిద్ధూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ అల్లర్ల కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటూ పోలీసులు ఆయన్ను రెండుసార్లు అరెస్టు కూడా చేశారు. దీప్ సిద్ధూ మరణం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంతాపం తెలియజేశారు.