Radio City Super Singer: వచ్చేస్తున్న ‘రేడియో సిటీ సూపర్ సింగర్’.. మీరు సిద్ధమా?
ABN , First Publish Date - 2022-12-16T18:46:48+05:30 IST
దేశంలోనే అతిపెద్ద సింగిల్ టాలెంట్ హంట్ మళ్లీ వచ్చేస్తోంది. దేశంలోని ప్రముఖ రేడియో నెట్‌వర్క్ ‘రేడియో సిటీ’ (Radio City) ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద సింగిల్ టాలెంట్ హంట్ మళ్లీ వచ్చేస్తోంది. దేశంలోని ప్రముఖ రేడియో నెట్‌వర్క్ ‘రేడియో సిటీ’ (Radio City) ప్రతిష్ఠాత్మక కార్యక్రమం రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ 14 (Radio City Super Singer) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలంగా లక్షలాది మంది భారతీయుల అభిమానాన్ని ఈ షో చూరగొంది. సింగింగ్ టాలెంట్ హంట్ ద్వారా రేడియో సిటీ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇప్పుడు ‘అగర్ హై మ్యూజిక్ సే ప్యార్, తో బనో సిటీ కే అగ్లే సింగింగ్ స్టార్’ ట్యాగ్‌లైన్‌తో పోటీ నిర్వహిస్తుంది.
వరుసగా మూడో ఏడాది కూడా సోల్‌ఫుల్ మ్యాస్ట్రో పద్మశ్రీ కైలాశ్ ఖేర్(Kailash Kher) ఈ పోటీలకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఈసారి ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆన్ ఎయిర్, ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్స్‌తో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ ఆడిషన్స్ డిసెంబర్ 6న ప్రారంభమయ్యాయి. 18 ఏళ్లు దాటిన యువతీయువకులు ఈ షోలో పాల్గొనేందుకు అర్హులు. ఓటింగ్ లైన్స్ డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. రేడియో సిటీ సూపర్ సింగర్ ఫైనల్స్‌ను డిసెంబర్ 21 నుంచి 23 వ తేదీ వరకు జరుపనున్నారు. ప్రతి మార్కెట్‌లోనూ టాప్ 5 సింగర్స్‌ను ఎంపిక చేయడంతో పాటు రన్నరప్‌ను కూడా ప్రకటిస్తారు.
ఈ సందర్భంగా రేడియో సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అషిత్ కుకైన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఔత్సాహిక గాయకులకు ఓ వేదికను అందించాలనే తమ నిబద్ధతకు ఈ షో అద్దం పడుతుందన్నారు. రేడియో సిటీ సూపర్ సింగర్ తమ ప్రతిష్టాత్మకమైన ప్రోపర్టీ అని పేర్కొన్నారు. కైలాశ్ ఖేర్ మాట్లాడుతూ.. తన సంగీత ప్రయాణంలో రేడియో సిటీ ఓ భాగంగా మారిపోతుందన్నారు. రేడియో సిటీ సూపర్ సింగర్ మరో సీజన్ ద్వారా ఔత్సాహిక గాయనీగాయకులకు మెంటార్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. సింగింగ్ ప్రతిభావంతులను గుర్తించేందుకు ఓ వేదికను అందిస్తున్న ఒకే ఒక్క రేడియో ప్లాట్‌ఫామ్‌గా రేడియో సిటీ నిలిచిందన్నారు.
ఈ పోటీలను భారతదేశ వ్యాప్తంగా 39 నగరాలలో చేస్తున్నారు. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా ఎథర్ ఎనర్జీ వ్యవహరిస్తోంది. ఈ 14వ సీజన్ రేడియో సిటీ సూపర్ సింగర్‌ను రేడియో, డిజిటల్, ఆన్‌గ్రౌండ్ యాక్టివేషన్‌తో ప్రచారం చేయనున్నారు. ఔత్సాహికులు https://www.radiocity.in/radiocitysupersinger ద్వారా తమపేర్లను నమోదు చేసుకోవచ్చు.