Cyclist Rahul Gandhi: యాత్రలో సైక్లిస్టుగా మారిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2022-11-28T10:50:56+05:30 IST
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం సైక్లిస్టుగా మారారు. భారత్ జోడో యాత్రలో..
ఇండోర్ (మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం సైక్లిస్టుగా మారారు. భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra )భాగంగా సోమవారం ఇండోర్ నగరంలో సైకిలు తొక్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యపర్చారు.(Cyclist Rahul Gandhi) మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో మోటార్‌సైకిల్ నడిపిన రాహుల్ గాంధీ ఒక రోజు తర్వాత సోమవారం ఇండోర్‌లో(Indore) పార్టీ భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కారు.(Turns Cyclist)కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టి పూలవర్షం కురిపిస్తుండగా రాహుల్ సైకిలు తొక్కారు.
యాత్రలో భాగంగా ఫుట్‌బాల్ ఆడటం, గిరిజనులతో కలిసి నృత్యం చేయడం, నడవడం, రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సరదాగా గడపిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(New Ride) 82వ రోజు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సోమవారం ఉదయం ఇండోర్‌లోని బడా గణపతి చౌరహా నుంచి తిరిగి ప్రారంభమైంది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల పొడవైన భారత్ జోడో యాత్ర అట్టడుగు స్థాయి ప్రజలతో కాంగ్రెస్ అనుబంధాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను కవర్ చేసింది.