Indian Navy: భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మోర్ముగావ్
ABN , First Publish Date - 2022-12-18T18:14:17+05:30 IST
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన అత్యంత శక్తివంతమైన P15B స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్‌ను
ముంబై: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన అత్యంత శక్తివంతమైన P15B స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక (Warsihip) ఐఎన్ఎస్ మోర్ముగావ్ (INS Mormugao)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ఆదివారంనాడు నౌకాదళంలో (Indian Navy) ప్రవేశపెట్టారు. దీనికి ముందు ముంబై చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమారి, గోవా గవర్నర్ పీఎస్ శ్రీథరన్ పిళ్లై, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితర ప్రముఖులు స్వాగతం పలికారు. అనంతరం ముంబై నావల్ డాక్‌యార్ట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యుద్ధనౌకల్లో ముర్ముగోవ్ ఒకటని అన్నారు. భారతదేశ తీరప్రాంత సామర్థ్యాల పెంపులో ఇదొక గణనీయమైన ప్రగతి అని అన్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని, ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా ఇందులోని వ్యవస్థలు తీర్చగలవని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానం కలిగిన నౌకల తయారీ కేంద్రంగా ఇండియాను తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఇతర దేశాలకు కూడా నౌకానిర్మాణాలు చేసిపెడతామని తెలిపారు.
స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకల తయారీ చరత్రలో క్షిపణి విధ్వంసక ముర్ముగోవ్ జలప్రవేశం ఒక మైలురాయి అని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ అన్నారు. ఏడాది క్రితమే విశాఖపట్నంలో ముర్ముగావ్ యుద్ధనౌకను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గత దశాబ్దంగా వార్ షిప్ తయారీ, నిర్మాణ సామర్థ్యం దిశగా పడిన కృషికి ముర్ముగోవ్ నిదర్శనమని అన్నారు. చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట యుద్ధనౌకకు నామకరణం చేశామని చెప్పారు.
యుద్ధనౌక ప్రత్యేకతలు..
వార్‌షిఫ్ డిజైన్ బ్యూరో దేశీయంగా రూపొందించిన నాలుగు వి శాఫట్నం క్లాస్ డిస్ట్రాయిర్లలో మోర్ముగావ్ రెండవది. మజగావ్ డాక్ షిప్ బిల్టర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 7400 టన్నుల బరువు కలిగిన యుద్ధనౌక ఇది. ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్ ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణలు ప్రయోగించ వచ్చు. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బయిన్లతో గంటకు 30 నాట్‌ల వేగాన్ని అందుకోగలదు. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత బలం చేకూరుతోంది.