Rishi Sunak : సునాక్‌కు పన్నుల సెగ

ABN , First Publish Date - 2022-12-13T03:09:43+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌కు పన్నుల సెగ తగిలింది. దేశంలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సొంత పార్టీ సభ్యుల

 Rishi Sunak : సునాక్‌కు పన్నుల సెగ

సొంత పార్టీలోనే తిరుగుబాటు గళం

పన్నులు తగ్గించాలని 40 మంది ఎంపీల లేఖ

లండన్‌, డిసెంబరు 12: బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌కు పన్నుల సెగ తగిలింది. దేశంలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సొంత పార్టీ సభ్యుల నుంచే ఆయన తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నారు. పన్నులు తగ్గించాలంటూ 40 మంది టోరీ ఎంపీలు ఆదివారం ఆర్థిక మంత్రి జెరిమీ హంట్‌కు లేఖ రాశారు. టోరీ సభ్యుల వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పటికే హౌసింగ్‌ టార్గెట్లు, పవన విద్యుత్తు సహా అనేక విధానపరమైన నిర్ణయాల్లో సునాక్‌ ప్రభుత్వం యూ-టర్న్‌ తీసుకుంది. మరోవైపు సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి వచ్చే సాఽధారణ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదనే సంకేతాల నేపథ్యంలో టోరీ ఎంపీలు సురక్షిత నియోజకవర్గాలు వెతుక్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే సంకేతం కూడా ఎంపీల ఓటు బ్యాంకుకు మరింత ముప్పుగా పరిణమించింది. నియోజకవర్గం మారాలనుకొంటున్న ఎంపీలు సరిహద్దు మార్పులను సాకుగా చూపుతున్నారు. ప్రస్తుత ఎం పీలకు ప్రజలు వీడ్కోలు పలకనున్నట్టు ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించాయి.

Updated Date - 2022-12-13T03:09:44+05:30 IST