Shiv Lingam: పురాతన శివలింగం లభ్యం
ABN , First Publish Date - 2022-11-26T10:07:57+05:30 IST
స్థానిక పాలారు నదిలో ఇసుక తవ్వుతున్న సమయంలో శివలింగం(Shiv Lingam) బయల్పడింది. ఈ నదిలో శుక్రవారం ఉదయం ఇసుక తీస్తున్న సమయంలో రాతి శివలింగం, ఆలయ స్తంభం
వేలూరు(చెన్నై), నవంబరు 25: స్థానిక పాలారు నదిలో ఇసుక తవ్వుతున్న సమయంలో శివలింగం(Shiv Lingam) బయల్పడింది. ఈ నదిలో శుక్రవారం ఉదయం ఇసుక తీస్తున్న సమయంలో రాతి శివలింగం, ఆలయ స్తంభం బయల్పడ్డాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో శివాలయం ఉండొచ్చని, కాలక్రమేణా నదిలో మునిగి ఉండొచ్చని రెవెన్యూ శాఖ అధికారులు భావిస్తుండగా, వేలూరు ప్రభుత్వ మ్యూజియం అధికారులు శివలింగాన్ని పరిశీలిస్తున్నారు.