మెక్సికో బార్‌లో కాల్పులు.. 9 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-11-11T03:26:53+05:30 IST

మెక్సికోలో మరో బార్‌లో తుపాకీ గర్జించింది. బుధవారం రాత్రి అపాసియో ఎల్‌ ఆల్టో బార్‌లోకి చొరబడ్డ ‘మారో’ గ్యాంగ్‌ సాయుధులు..

మెక్సికో బార్‌లో కాల్పులు.. 9 మంది దుర్మరణం

క్రిమినల్‌ గ్యాంగ్‌ల మధ్య గొడవలే కారణం

మెక్సికో, నవంబరు 10: మెక్సికోలో మరో బార్‌లో తుపాకీ గర్జించింది. బుధవారం రాత్రి అపాసియో ఎల్‌ ఆల్టో బార్‌లోకి చొరబడ్డ ‘మారో’ గ్యాంగ్‌ సాయుధులు.. అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు మహిళావెయిటర్లతో సహా.. తొమ్మిది మంది బార్‌ సిబ్బంది మృతిచెందారు. బార్‌ యాజమాన్యం తమ ప్రత్యర్థి వర్గమైన ‘జెలిస్కో’ క్రిమినల్‌ గ్యాంగ్‌కు మద్దతివ్వడమే ఇందుకు కారణమని పేర్కొంటూ ‘మారో’ గ్యాంగ్‌ అక్కడ ఓ పోస్టర్‌ను వదిలి వెళ్లారు. గత నెలలో కూడా ఇదే నగరంలోని ఓ బార్‌లో క్రిమినల్‌ గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా 12 మంది.. అంతకు ముందు నెలలో మరో బార్‌లో 10 మంది చనిపోయారు. మెక్సికోలో అపాసియో ఆల్టో నగరానికి మాదక ద్రవ్యాల క్రిమినల్‌ గ్యాంగ్‌లకు అడ్డాగా పేరుంది.

Updated Date - 2022-11-11T03:26:54+05:30 IST