Subramanya Swamy: తిరుత్తణి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-12-27T10:28:00+05:30 IST
సెలవులు రావడంతో తిరుత్తణి సుబ్రమణ్యస్వామి(Subramanya Swamy) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఆలయా
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 26: సెలవులు రావడంతో తిరుత్తణి సుబ్రమణ్యస్వామి(Subramanya Swamy) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఆలయానికి ప్రతిరోజు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుండగా శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ప్రకటించడంతో కుటుంబాలతో సహా తిరుత్తణికి వచ్చే భక్తులు సంఖ్య పెరిగింది. క్యూలైన్‌లలో సుమారు మూడు గంటల వేచి ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.