Amristar: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై మహిళ.. వైరల్ వీడియో..

ABN , First Publish Date - 2022-09-13T01:29:30+05:30 IST

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అక్రమ మాదక ద్రవ్యాల బెడద తీవ్రతకు అద్దం పడుతూ నడిరోడ్డుపై..

Amristar: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై మహిళ.. వైరల్ వీడియో..

చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అక్రమ మాదక ద్రవ్యాల బెడద తీవ్రతకు అద్దం పడుతూ నడిరోడ్డుపై ఓ మహిళ డ్రగ్స్ మత్తులో తూలుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో అధికార యంత్రాగం కదిలింది. ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గంలోని మఖ్బూల్‌పుర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాదకద్రవ్యాల ప్రభావంతో ఆ మహిళ ఉన్నచోట నుంచి ఒక్క అడుగు కూడా కదల్చలేకుండా అక్కడే కుప్పకూలే స్థితికి చేరుకోవడం ఆ  వీడియోలో కనిపిస్తోంది.


కాగా, డ్రగ్స్ మత్తులో తూలుతున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మక్బూల్‌పురా పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళ కనిపించిన ప్రాంతంలో తనిఖీలు జరిపి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదే ప్రాంతం నుంచి దొంగతనానికి గురైనట్టు అనుమానిస్తున్న ఐదు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.


కాగా, డ్రగ్స్ మత్తులో కనిపించిన మహిళను డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్టు అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జీవన్ జ్యోత్ కౌర్ తెలిపారు. సిక్కుల పవిత్ర నగరంగా పేరున్న మఖ్బూల్‌పుర తరచు మాదక ద్రవ్యాల బెడదను ఎదుర్కొంటోంది. పలుమారు డీ-అడిక్షన్ డ్రైవ్‌లు నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.

Updated Date - 2022-09-13T01:29:30+05:30 IST