Covid XBB variant : కోవిడ్ కొత్త వేరియెంట్‌పై కేంద్రం హెచ్చరిక

ABN , First Publish Date - 2022-12-22T14:19:53+05:30 IST

చైనా తదితర దేశాల్లో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఓ వాట్సాప్ మెసేజ్ వేగంగా చక్కర్లు కొడుతోంది.

Covid XBB variant : కోవిడ్ కొత్త వేరియెంట్‌పై కేంద్రం హెచ్చరిక
Covid

న్యూఢిల్లీ : చైనా తదితర దేశాల్లో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఓ వాట్సాప్ మెసేజ్ వేగంగా చక్కర్లు కొడుతోంది. ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ (XBB) వేగంగా వ్యాపిస్తోందని, ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని, దీనివల్ల మరణాల రేటు అధికంగా ఉంటుందని ఈ మెసేజ్ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా గతంలో వచ్చిన వేరియంట్ల లక్షణాలకన్నా కన్నా దీని లక్షణాలు పూర్తిగా భిన్నమైనవని చెప్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇది తప్పుదోవ పట్టించే మెసేజ్ అని, బూటకపు మెసేజ్ అని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌ను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ప్రజలను కోరింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎక్స్‌బీబీ వేరియంట్ అంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కన్నా ఎక్కువ ప్రాణాంతకమైనదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ప్రాణాంతకమైనదని పేర్కొంది. ఎక్స్‌బీబీ వేరియంట్ అంతకుముందటి ఒమిక్రాన్ వెర్షన్స్ కన్నా వేగంగా వ్యాపించగలదని, అయితే దీనివల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది.

అయితే చైనాలో ప్రస్తుతం బీఎఫ్7 (ఒమిక్రాన్ సబ్‌వేరియంట్) ఉందని, అది ఎక్స్‌బీబీ కాదని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

Updated Date - 2022-12-22T14:19:57+05:30 IST