పెన్షన్ స్కీం సొమ్ము మొత్తం తీసుకోవచ్చు
ABN , First Publish Date - 2022-11-01T02:46:09+05:30 IST
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం-1995 (ఈపీఎస్-95) చందాదారులకు వెసులుబాటు కలిగింది. సర్వీసు ఆరు నెలల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ స్కీంలోని మొత్తం సొమ్మును తీసుకోవచ్చు.
ఉద్యోగులకు వెసులుబాటు.. ఈపీఎ్‌ఫఓ నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబరు 31: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం-1995 (ఈపీఎస్-95) చందాదారులకు వెసులుబాటు కలిగింది. సర్వీసు ఆరు నెలల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ స్కీంలోని మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. ఇంతవరకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎ్‌ఫఓ) చందాదారులకు ఈ సౌకర్యం ఉండగా, దాన్ని ఇప్పుడు పెన్షన్ స్కీం వారికి కూడా వర్తింపజేశారు. సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి సమావేఽశంలో ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈపీఎ్‌సలో 34 ఏళ్లకన్నా ఎక్కువగా సభ్యత్వం ఉన్నవారికి దామాషా ప్రకారం పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సమావేశం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇలాంటి వారికి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ పెన్షన్‌ను నిర్ణయిస్తారు. ఈపీఎస్-95 కింద మినహాయింపులు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా దాన్ని సమాన విలువ బదిలీ కింద లెక్కిస్తారు. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎ్‌ఫ)లో పెట్టుబడులను నగదు రూపంలో మార్చుకోవడంపై రూపొందించిన విధానానికి ఆమోదం తెలిపింది. సమాచార భద్రత విధానం, ఐటీ హార్డ్‌వేర్ కొనుగోళ్లకు ఆమోద ముద్ర వేసింది.