Diabetes: పండుగ సీజన్‌లో డయాబెటిస్ నియంత్రణకు ఐదు చిట్కాలు

ABN , First Publish Date - 2022-12-13T21:30:03+05:30 IST

క్రిస్మస్ వచ్చేస్తోంది. అంతులేని వేడుకలు తెస్తోంది. పండుగ వేళ బోల్డన్ని డెజర్ట్‌లు మనసును కలవరపెడుతుంటాయి. తినకుండా

Diabetes: పండుగ సీజన్‌లో డయాబెటిస్ నియంత్రణకు ఐదు చిట్కాలు
Diabetes

క్రిస్మస్ వచ్చేస్తోంది. అంతులేని వేడుకలు తెస్తోంది. పండుగ వేళ బోల్డన్ని డెజర్ట్‌లు మనసును కలవరపెడుతుంటాయి. తినకుండా ఉండలేని పరిస్థితిని తీసుకొస్తాయి. అయితే, ఒకసారి వాటిని రుచి చూస్తే జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక ఇబ్బంది పడతాం. మధుమేహం ఇప్పుడు చాలామంది జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. డయాబెటిస్ (Diabetes) బారినపడిన వారు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాల వైపు చూస్తుంటారు. సిరప్ లాడెన్ లేదంటే డీప్ ఫ్రైడ్ ట్రీట్‌లను నివారించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ ఇది అందరికీ సాధ్యం కాదు.

పండుగ సీజన్ తర్వాత మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ నితిన్ రెడ్డి చెప్పడం డయాబెటిస్ తీవ్రతకు అద్దం పడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar Levels) పెరగకుండా చూసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు రక్తంలో గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ పండుగ సీజన్‌లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగకుండా అదుపులో ఉంచుకునేందుకు ఈ ఐదు చిట్కాలు పాటిస్తే సరి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వస్తే అక్కడ ఏం తినాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం సమతౌల్యంగా, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఓ పూట భోజనాన్ని మానేస్తే ఆ తర్వాత దానిని భర్తీ చేసేలా అధిక మోతాదులో తినడం మానుకోవాలి. ఇది రక్తంలో చక్కెర మోతాదు హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు డాక్టర్, డైటీషియన్‌తో మాట్లాడుతూ ఉండాలి.

క్రమం తప్పకుండా పర్యవేక్షణ

సెలవుల సీజన్‌లో జీవనశైలి, ఆహార మార్పులు సాధారణం. చక్కెర స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఫ్రీస్టైల్ లిబ్రే సిస్టమ్ వంటి నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ పరికరం ఇందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫింగర్ ప్రిక్స్‌కి నొప్పి లేకుండా ఉంటుంది. దీనితో రోజు గడిచే కొద్దీ చక్కెర స్థాయులను సజావుగా పర్యవేక్షించేలా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రెడ్ ఫ్లాగ్ ట్రెండ్‌ల (హైపోగ్లైసీమియా/ హైపర్ గ్లైసీమియా) విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు సాయపడుతుంది.

నిద్ర నాణ్యతపై రాజీ వద్దు

పార్టీలు అంటే మీరు రాత్రి చాలా సేపటి వరకు మెలకువగానే ఉన్నారని అర్థం. నిద్ర వ్యవధి, నాణ్యత విషయంలో అసలు రాజీ వద్దు. రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర చాలా అవసరం. డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు డోజింగ్ చక్కగా సాయపడుతుంది.

చురుగ్గా ఉండాలి

మధుమేహాన్ని అదుపులో ఉంచే సాధనాల్లో వ్యాయామం ఒకటి. ఫెస్టివల్ సీజన్‌లో తరచూ ఈవెంట్‌లు, స్నేహితుల సందర్శన కారణంగా ఫిట్‌నెస్ షెడ్యూల్ కొంత కష్టంగా మారుతుంది. కాబట్టి శారీక శ్రమ కోసం నడక, ఫుట్‌బాల్, డ్యాన్స్ (జుంబా), సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కండరాలను టోన్ చేయడం, ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్త ప్రసరణను పెంచడం, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటివి గ్లూకోజ్ స్థాయులను తగ్గించడంలో సాయపడతాయి.

హైడ్రేటెడ్‌గా ఉండాలి

హైడ్రేటెడ్‌గా ఉండడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మధుమేహంతో బాధపడుతున్న వారు నీరు తాగుతూ ఉండాలి. నీరు రక్తంలో చక్కెర స్థాయులను త్వరగా తగ్గిస్తుంది. కాబట్టి వాటర్ బాటిల్‌ను చేతిలో ఉంచుకోవడం అనేది మంచి ఆలోచన. ఇవన్నీ పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

Updated Date - 2022-12-13T21:30:05+05:30 IST