cancer in cats: పెంపుడు పిల్లుల్లో వచ్చే క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.

ABN , First Publish Date - 2022-11-13T10:43:43+05:30 IST

పిల్లులకు క్యాన్సర్ సోకినట్లయితే అది చాలా వరకూ శక్తిని హరించేస్తుంది.

cancer in cats: పెంపుడు పిల్లుల్లో వచ్చే క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.
cancer in cats

పిల్లలు పెంపుడు జంతువులుగా మన ఇళ్ళల్లో వ్యక్తుల్లా మెలుగుతూ ఉంటాయి. పిల్లులు ఎంత హుషారుగా ఉంటాయో అదే బాధ కలిగితే దానిని చూపించడానికి ఇష్టపడవు. తరచుగా కలిగే అసౌకర్యాన్ని కూడా రహస్యంగా దాస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లుల్లో క్యాన్సర్ ను గుర్తించడం కష్టం.

1. మామూలుగా కంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవడం పిల్లికి అనారోగ్యం కలిగిందనే విషయాన్ని తెలుపుతుంది.

2. పిల్లులకు క్యాన్సర్ సోకినట్లయితే అది చాలా వరకూ శక్తిని హరించేస్తుంది. బరువు కూడా తగ్గుతాయి.

3. అతిగా నిద్రపోతాయి. ఆడుకోవడానికి, చలాకీగా ఉండేందుకు ఆసక్తి చూపించవు.

4. కొన్ని రకాల క్యాన్సర్ లలో అతిసారం, వాంతులు కూడా లక్షణాలుగా ఉంటాయి.

5. అలాగే కొన్ని గాయాలు కూడా త్వరగా నయం కావు. అలాంటప్పుడు పిల్లికి క్యాన్సర్ సోకిందని అనుమానించాలి.

6. పెంపుడు జంతువు వయస్సు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని గమనించాలి.

cancer-in-cats.jpg

పిల్లికి క్యాన్సర్ సోకిందని తెలుసుకునేందుకు ఈ సంకేతాలు గమనించండి.

1. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం: పిల్లి రోజువారి తీసుకునే ఆహారంకన్నా ఎక్కువ తినలేకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. క్యాన్సర్ కణాలు చాలా శక్తిని, పోషణను తీసుకుంటాయి కనుక ఇది బరువును తగ్గడానికి కారణం అవుతుంది.

2. ఆకస్మిక కుంటితనం, బద్దకం: పిల్లులు సాధారణంగా మేల్కొని ఉన్నప్పుడు చురుకుగా ఉంటాయి. కానీ మామూలు సమయానికంటే ఎక్కువ టైం తీసుకుని నిద్రపోతున్నట్టయితే ఆటలు తగ్గినా గమనించాలి. అలాగే అప్పటికప్పుడు వచ్చినట్టుగా కుంటితనంతో బాధ పడుతుంటే అది నొప్పివల్ల కావచ్చు. ఇలాంటి సమస్య గమనించగానే పశువైద్యుని సంప్రదించడం మంచిది.

3. వాంతులు, విరేచనాలు, దుర్వాసన: ఇలాంటి అతిసార, వాంతులు సాధారణంగా పిల్లుల్లో కనిపిస్తాయి. దీనికి అనేక కారణాలు ఉండచ్చు. విరేచనాలు, వాంతులు ఎక్కువకాలం ఉంటే కనుక క్యాన్సర్ కూడా కావచ్చుననే అవగాహనతో పశువైద్యుని సలహా తీసుకోవడం అవసరం.

4. నయం కాని పుండ్లు, గాయాలు: క్యాన్సర్ పిల్లుల రోగనిరోధక వ్యవస్థను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఇటువంటి సమయంలో పిల్లులకు పుండ్లు ఏర్పడతాయి. పిల్లి క్యాన్సర్‌తో బాధపడుతుంటే చిన్న గీత కూడా నయం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది.

5. గడ్డలు: పొత్తికడుపులో గడ్డలు ఏర్పుడతాయి. సకాలంలో రోగనిర్ధారణకు FNA ఆస్పిరేట్‌ను క్యాన్సర్‌ను గుర్తించడానికి పరీక్ష చేయించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు,కళ్ళ నుండి స్రావాలు,ముక్కు నుండి రక్తం కారడం కూడా గమనించవలసిన సంకేతాలు.

Updated Date - 2022-11-13T10:43:57+05:30 IST