Finland : ఫిన్లాండ్
ABN , First Publish Date - 2022-12-03T23:54:23+05:30 IST
ఉత్తర యూర్‌పలో ఉండే ఫిన్లాండ్ 1917 డిసెంబరు 6న స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఫిన్నిష్, స్వీడిష్ భాషలు అధికార భాషలు. రాజధాని పేరు ‘హెల్సింకి’ ..
ఉత్తర యూర్‌పలో ఉండే ఫిన్లాండ్ 1917 డిసెంబరు 6న స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఫిన్నిష్, స్వీడిష్ భాషలు అధికార భాషలు. రాజధాని పేరు ‘హెల్సింకి’ ఇది ప్రపంచంలో ‘హ్యాపియస్ట్ కంట్రీ’ లో మొదటి స్థానం. అంటే ఆనందానికి కేరాఫ్ అడ్రస్ అనమాట.
ఫట్టుమని మాట్లాడితే ఈ దేశ జనాభా అరవై లక్షలు దాటదు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనసంఖ్య అనమాట. 72 శాతం అడవులు ఉంటాయి. ప్రపంచంలోనే శుద్ధమైన గాలిని పీల్చేవాళ్లలో వీళ్లే నంబర్‌వన్.
ఫోన్ల కంపెనీ నోకియా ఈ దేశానిదే. చలికాలంలో ఐస్‌హాకీ. ఐస్ స్కేటింగ్ ఆడుతారు. వేసవిలో ఈత, వాటర్‌స్పోర్ట్స్. ఫిషింగ్ చేయటానికి ఇష్టపడతారు. ప్రతి ఇంటిలో వేడినిచ్చే హీట్‌రూమ్ కచ్చితంగా ఉంటుందిక్కడ.
ఫిన్లాండ్ ప్రజలు కాఫీని అధికంగా తాగుతారు. ఎంతంటే ఒక్కో వ్యక్తి సంవత్సరానికి దాదాపు 12 కేజీల కాఫీపొడిని తీసుకుంటారు. అంటే రోజుకు 8 కప్పుల కాఫీ తాగుతారు.
1,87,888 సరస్సులు ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని ‘కంట్రీ ఆఫ్ లేక్స్’ అని కూడా పిలుస్తారు.
జర్మనీ, సింగపూర్ తర్వాత మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఈ దేశానిది. దీనితో 175 దేశాలు తిరగొచ్చు. సోషల్ సెక్యూరిటీస్ (చైల్డ్ కేర్, ఉద్యోగం, హెల్త్‌కేర్) ప్రభుత్వం ఇస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందిఇక్కడ.
ప్రకృతితో డీప్ కనెక్షన్‌లో ఉంటారీ ప్రజలు. విచిత్రమేంటంటే.. వీళ్లకు నిశ్శబ్దంగా ఉండటం ఇష్టం. ఎవరితోనైనా హలో అన్నాక.. వారి పనిలో మునిగిపోతారు. పబ్లిక్‌లో కూడా ఇతరులతో దూరం ఉండటానికి ఇష్టపడతారు.
సంవత్సరానికి 70 పండగలను సెలబ్రేట్ చేస్తారిక్కడ. ప్రపంచంలోనే ఫస్ట్‌క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుందిక్కడ. పిల్లలు వారంలో కేవలం 20 గంటలు మాత్రమే చదువుకోవాలి. మిగతా సమయంలో ఆటలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు.
ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ. పోలీసుల మీద ప్రజలకు విశ్వాసమెక్కువ. మీకో విషయం తెలుసా.. ఇక్కడ పర్సు పోగొట్టుకుంటే అది మీ ఇంటికి వస్తుంది. ఒక సర్వే ప్రకారం 12 పర్సులు మీ ప్యాకెట్‌లోంచి మిస్సయితే.. దాదాపు అన్ని పర్సులు మిమ్మలను వెతుక్కుంటూ వస్తాయి. అంతటి నిజాయితీపరులు వీరు.