Why children communicating with parents: పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య సమాచారలోపం ఎందుకు వస్తుంది..?
ABN , First Publish Date - 2022-10-26T12:45:45+05:30 IST
పెరిగే వయసులో పిల్లల ప్రతి మాటను తల్లిదండ్రులు వింటూ ఉండాలి.
Parenting tips: పిల్లలు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నారు: సైకోథెరపిస్ట్ ఏమంటున్నారంటే..! కొన్నిసార్లు పిల్లలు తమ ఫీలింగ్స్ ని తల్లిదండ్రులతో పంచుకోరు అయితే ఇది ఎందుకు జరుగుతుంది. పెరిగే వయసులో పిల్లల ప్రతి మాటను తల్లిదండ్రులు వింటూ ఉండాలి. చాలా విషయాలను వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. చర్చించాలి. ఇది పెరిగే పిల్లలకు చాలా ముఖ్యం.
పిల్లలు విపరీతంగా ఆలోచిస్తారు.
పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఆందోళన చెందుతారు. ఒక విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడానికి పదే పదే ఆలోచిస్తారు. అలాంటప్పుడు వాళ్ళ మనసును తల్లి లేక తండ్రి మాత్రమే తెలుసుకోవాలి. డల్ గా కనిపించినా, పరధ్యాన్నంగా ఉన్నా గమనించాలి.
పిల్లలకు మాట్లాడేందుకు సమయం లేదనిపిస్తుంది.
కొందరు తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇది గమనించిన పిల్లలు వాళ్ళను కదిపి మాట్లాడాలని అనుకోరు. ఒకవేళ పలకరించినా పెద్దలు కసురుకుంటారనే ఆలోచన రాగానే పిల్లలు అసలు వాళ్ళ దగ్గరకు పోవడానికి కూడా ఇష్టపడరు. దీనితో పిల్లలకు పెద్దలకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది.
పిల్లల ముందు గొడవలు పడుతున్నారా..
పిల్లలు చూస్తుండగా పెద్దలు గొడవలు పడటం కూడా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. మనసులోని మాటలను బయటపెట్టడం మంచిది కాదనే అభిప్రాయానికి వస్తారు.
పిల్లలు కోరుకున్నది సరైనదేనా..
పిల్లలు ఇది తమకి కావాలని, నచ్చిందని అడిగి తీరా కొనుక్కున్నాకా ఆ వస్తువులోని లోపాలను చూపించి తిట్టకూడదు. ఇది వాళ్ళను చిన్నబుచ్చుకునేలా చేస్తుంది. నెమ్మదిగా లోపాలను వాళ్ళే తెలుసుకునేలా చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళను గిల్టీగా ఫీలయ్యేలా చేస్తుంది. కాబట్టి అందులోని లోపాలను వాళ్ళనే తెలుసుకోనివ్వాలి.