Colorado: ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా?.. కూతురితో పాటు 20మంది మైనర్లతో..
ABN , First Publish Date - 2022-12-07T10:09:10+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొలరాడో నగరానికి (Colorado) చెందిన శామ్యూల్ రాపిలీ బాట్‌మెన్ (Samuel Rappylee Batemen) అనే ఓ మతబోధకుడు తన సొంత కూతురితో పాటు 20 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు.
కొలరాడో: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొలరాడో నగరానికి (Colorado) చెందిన శామ్యూల్ రాపిలీ బాట్‌మెన్ (Samuel Rappylee Batemen) అనే ఓ మతబోధకుడు తన సొంత కూతురితో పాటు 20 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల శామ్యూల్‌ను ఎఫ్‌బీఐ (FBI) అరెస్ట్ చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. కాగా, శామ్యూల్ తనను తాను ఓ ప్రవక్తగా కూడా ప్రకటించుకున్నట్లు ఎఫ్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ మంది మైనర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ (FLDS) నాయకుడిగా ఉన్న శామ్యూల్ రాపిలీ బాట్‌మెన్ ఓ మతబోధకుడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటాడు. దాంతో అతడికి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. వారిలో అమ్మాయిలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో 15 నుంచి 20ఏళ్లలోపు అమ్మాయిలను తన మాటలతో ఆకర్షించేవాడు. ఆ తర్వాత వారికి మరింత దగ్గరై పెళ్లి చేసుకునేవాడు.
ఇలా ఇప్పటివరకు సుమారు 20 మంది యువతులను పెళ్లాడాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. శామ్యూల్ పెళ్లి చేసుకున్న వారిలో అతని సొంత కూతురు కూడా ఉండడం. అంతేగాక 20 మందిలో చాలా వరకు 15ఏళ్లలోపు మైనర్లే ఎక్కువ మంది ఉన్నారట. ఇక మనోడు ఇలా మైనర్లను పెళ్లి చేసుకోవడంతోనే ఆగిపోలేదు. వారితో మరో నీచమైన పని కూడా చేయించాడు. వారిని తన ఫాలోవర్లుగా ఉన్న అబ్బాయిలతో గ్రూప్ సెక్స్‌లో పాల్గొనేలా చేశాడు. వాటిని వీడియో తీసి సొమ్ము చేసుకునేవాడు. దీనికోసం తన సొంతకూతుళ్లను కూడా వదల్లేదట అతడు ఎంత నీచుడో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఒక అమ్మాయికి అయితే కేవలం పన్నెండేళ్లేనట. అది కూడా తన ముందే శృంగారంలో పాల్గొనాలని చెప్పేవాడు.
ఈ క్రమంలో ఇటీవల శామ్యూల్ ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు 15ఏళ్ల లోపు అమ్మాయిలతో కలిసి ఎస్‌యూవీ వాహనం వెళ్తున్న సమయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా కొలరాడో పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వాహనం ట్రైలర్‌లో మరో ముగ్గు మైనర్లును గుర్తించారు పోలీసులు. వారికి 11 నుంచి 14 ఏళ్ల వయసు మాత్రమే. దాంతో అనుమానం వచ్చి శామ్యూల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించడంతో అతడి బండారం మొత్తం బయటపడింది. ఆ తర్వాత ఎఫ్‌బీఐకి అప్పగించారు. ఇక శామ్యూల్‌కు ఉన్న రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఎఫ్‌బీఐ అధికారులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. దాంతో ఈ కేసు విచారణ పూర్తి అయ్యేవరకు అతడిని కారాగారంలోనే ఉంచాలని యూఎస్ (US) మేజిస్ట్రేట్ న్యాయమూర్తి కామిల్లె బైబిల్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన కొలరాడోలో కలకలం సృష్టిస్తోంది.