NRI: బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
ABN , First Publish Date - 2022-10-24T19:46:04+05:30 IST
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోగల బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది.
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోగల బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బూస్టర్ నగరంలో మే నెలలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించినందుకు ఎన్నారై టిడిపి నాయకులందరినీ ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎన్నారై టీడీపీ నాయకులకు పిలుపునిచ్చిచ్చారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలు లేక అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎన్టీఆర్ కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో నెంబర్ 1 గా రాణించడమే గాక, తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేదవానికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సుపరిపాలన అందించారని ప్రశంసించారు. తెలుగువాడి ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పి, మన ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఘనుడు ఎన్టీఆర్ అని, అలాంటి మహానుభావుని శత జయంతి ఉత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్న ఎన్నారై టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో Boston city NRI TDP leadersతో పాటూ తానా మాజీ అధ్యక్షులు నన్నపనేని మోహన్, శ్రీనివాస్ గొంది, సుధాకర్ తురగా, అంకినీడు ప్రసాద్ రావి, శ్రీ బోల్ల, సూర్య తేలప్రోలు, అనిల్ పొట్లూరి, చంద్ర వల్లూరు పల్లి, సురేష్ దగ్గుబాటి, కోటేశ్వరరావు కందుకూరి, సురేష్ కమ్మ, రావి వేదల, గోపి నెక్కలపూడి, శరత్ బేతపూడి, బద్రి గుడివాడ, శ్రీకాంత్ చేబ్రోలు, రాజేష్ కాపు, హేమాద్రి లెక్కల, రావుల శ్రీనాథ్, పద్మ కందుకూరి, శిరీష గొంది తదితరులు పాల్గొన్నారు