NRI: బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ దీక్ష దివస్

ABN , First Publish Date - 2022-11-29T13:28:06+05:30 IST

బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దీక్ష దివస్ ఘనంగా జరిగింది.

NRI: బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ దీక్ష దివస్

ఎన్నారై డెస్క్: బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దీక్ష దివస్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. దీక్ష దివస్ చరిత్రను మలుపు తిప్పినరోజు అని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష తెలంగాణ పోరుకు రణ నినాదమయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తల పెట్టి.. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009, నవంబర్ 29న చేపట్టిన అమరణ నిరాహార దీక్ష నేటికీ 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని చెప్పారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. మొత్తం తెలంగాణ ప్రజలని ఏకంచేసి, నాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు. ప్రజలలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసిన రోజు అని కొనియాడారు. సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజు అని అన్నారు. అమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ అని చెప్పారు.

KCR-BB.jpg

తెలంగాణ సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా అదే ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ చేస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అద్భుతమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ త్యాగ నిరతికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, కొత్తూరు సాయన్న, గరిగె సతీష్ గౌడ్, తోకల లింగం, పలువురు టీఆర్ఎస్ నాయుకులు హాజరయ్యారు.

KCR-B.jpg

Updated Date - 2022-11-29T13:28:08+05:30 IST