Alok Sharma: బ్రిటన్‌లో భారత సంతతి మాజీ మంత్రికి నైట్‌హుడ్
ABN , First Publish Date - 2022-12-31T19:53:33+05:30 IST
భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మ నైట్‌హుడ్ బిరుదుకు ఎంపికయ్యారు.
ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మ(Alok Sharma) నైట్‌హుడ్(Knighthood) బిరుదుకు ఎంపికయ్యారు. వాతావరణ మార్పుల కట్టడికి అలోక్ శర్మ చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటన్ రాజు ఛార్ల్స్(King Charles) ఆయనను నైట్‌హుడ్‌తో సత్కరించారు. నైట్‌హుడ్‌కు ఎంపికైన 30 మంది భారత సంతతి వ్యక్తుల్లో అలోక్ శర్మ ప్రముఖంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన కాప్ 26(CoP-26) సమావేశానికి నేతృత్వం వహించి, బ్రిటన్ సహా పలు దేశా మధ్య చారిత్రాత్మక ఒప్పందం కోసం చేసిన కృషికి గాను ఆలోక్ నైట్‌హుడ్‌కు ఎంపికయ్యారని ఫారిన్ కామన్‌వెల్త్ డవలప్‌మెంట్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగ్రాలో జన్మించిన అలోశ్ శర్మ బ్రిటన్‌లో కేబినెట్ స్థాయి మంత్రిగా పనిచేశారు. గతేడాది స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ కట్టడి కోసం జరిగిన అంతర్జాతీయ సమావేశానికి(కాప్-26) అలోక్ శర్మ అధ్యక్షుడిగా వ్యవహరించారు.