Singaporean Jailed: కాఫీ, స్ట్రాబెర్రీ మిల్క్ అమ్మాడని వ్యక్తికి జైలు శిక్ష!

ABN , First Publish Date - 2022-12-14T18:35:40+05:30 IST

ఓ వ్యక్తి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాఫీ, స్ట్రాబెర్రీ మిల్క్ అమ్మాడంటూ వ్యాపారికి సింగపూర్ కోర్టు ఐదు వారాల జైలు శిక్ష(Singaporean Jailed) విధించింది. వినడానికి..

Singaporean Jailed: కాఫీ, స్ట్రాబెర్రీ మిల్క్ అమ్మాడని వ్యక్తికి జైలు శిక్ష!

ఎన్నారై డెస్క్: ఓ వ్యక్తి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాఫీ, స్ట్రాబెర్రీ మిల్క్ అమ్మాడంటూ వ్యాపారికి సింగపూర్ కోర్టు ఐదు వారాల జైలు శిక్ష(Singaporean Jailed) విధించింది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. పోనీ అతడు ఏమైనా కల్తీ ఉత్పత్తులు( For Selling Strawberry Milk and Coffee) అమ్మాడా అంటే అదీ లేదు. అయితే.. ఇంతకూ ఏం జరిగింది? అతడు చేసిన తప్పు ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ నార్త్ కొరియా(North Korea) ఎప్పుడూ వార్తల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. అణు ఆయుధాల విషయంలో నార్త్ కొరియా అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ 2017లో సింగపూర్(Singapore Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నార్త్ కొరియాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై నిషేధం విధించింది. కానీ ఈ నిబంధనను వెడ్ హీ(Wed Hee) అనే వ్యక్తి అతిక్రమించాడు. అప్పట్లో ఓ వైన్ కంపెనీలో మేనేజర్‌గా ఉన్న వెడ్ హీ.. 2017-2018 మధ్య ప్రభుత్వ అదేశాలను అతిక్రమించాడు. మద్యం ఉత్పత్తులతోపాటు కాఫీ, స్ట్రాబెర్రీ ఉత్పత్తులు సైతం నార్త్ కొరియాకు ఎగుమతి అయ్యేలా చేశాడు. లాభాపేక్ష కోసం కాకుండా నెల వారీ లక్ష్యాలను చేరుకునేందుకు అతడు ఈ పని చేసినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో అతడికి ఐదు వారాల జైలు శిక్ష విధిస్తూ సింగపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి లక్ష సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రెండింటినీ విధఇంచే అవకాశం ఉంటుంది.

Updated Date - 2022-12-14T18:48:09+05:30 IST