Indian Expat: అదృష్టం అంటే నీదే బాస్.. ఒకటా.. రెండా.. ఏకంగా రూ. 44కోట్లు మరీ..
ABN , First Publish Date - 2022-11-24T12:17:11+05:30 IST
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు.
దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలాగే కువైత్‌లో ఉండే ఓ భారతీయుడు (Indian) కూడా మహజూజ్ డ్రాలో (Mahzooz draw) గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. దాంతో ఇన్నాళ్లకు అతడికి అదృష్టం వరించి తాజాగా జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 20 మిలియన్ల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 44.44కోట్లు. ఈ నెల 19న దుబాయ్‌లో నిర్వహించిన డ్రాలో భారత్‌కు చెందిన దలీప్ (48) అనే వ్యక్తికే ఈ జాక్‌పాట్ తగిలింది.
వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా (Mechanical Engineer) పనిచేసే దలీప్ (48) గత కొన్నేళ్లుగా మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. కానీ, ఇప్పటివరకు ఏనాడు పెద్దగా గెలిచింది లేదు. అప్పడప్పుడు చిన్న అమౌంట్ మాత్రమే గెలిచేవాడు. అయిన ఏమాత్రం నిరాశకు గురికాకుండా లాటరీలో క్రమం తప్పకుండా పాల్గొంటూనే వస్తున్నాడు. ఇలాగే ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు తాజాగా జాక్‌పాట్ (Jackpot) తగిలింది. ఏకంగా రూ.44.44కోట్లు గెలుచుకున్నాడు. అంతే.. దలీప్ ఆనందానికి అవధుల్లేవు. అర్జెంట్‌గా తాను చేస్తున్న ఉద్యోగం మానేసి వరల్డ్ టూర్ వేసే ప్లాన్‌లో ఉన్నానని దలీప్ చెప్పాడు.
దలీప్ మాట్లాడుతూ.. "నవంబర్ 19న (శనివారం) రాత్రి పడుకుబోయే ముందు మహజూజ్ నుంచి నాకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. దాంతో ఎప్పటిలాగే ఏదో చిన్న అమౌంట్ గెలిచి ఉంటానని అనుకున్నా. అనుమానంగా ఆ మెయిల్ ఓపెన్ చేశా. కానీ, అందులో ఉన్న ప్రైజ్‌మనీ చూసి గుస్‌బమ్స్ వచ్చేశాయి. నిజమ? కలా? అని కొద్దిసేపు నన్ను నేనే నమ్మలేకపోయా. వెంటనే కుటుంబ సభ్యులను పిలిచి ఈ-మెయిల్ చూపించాను. వారు ఆ మెయిల్ చూసి ఎగిరిగంతేశారు. నేను వందేళ్లు పనిచేసి కూడబెట్టిన ఇంత సంపాదించేవాడిని కాదు. ఈ భారీ ప్రైజ్‌మనీతో నా ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అలాగే స్వదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం చేస్తున్న జాబ్ మానేసి యూఏఈలో ఏదో ఒక బిజినెస్ మొదలుపెడతాను. ముందుగా నా ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ వేస్తాను. నవంబర్ 19 నాటి రాత్రిని నా జీవితంలో మరిచిపోలేను. ఆ చీకటి రాత్రి నా జీవితంలో ఎప్పటికీ తరిగిపోని వెలుగును నింపింది." అంటూ దలీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.