Asian American: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసుల హవా.. చైనాకు భారత్ గట్టిపోటీ

ABN , First Publish Date - 2022-12-18T07:32:50+05:30 IST

అమెరికాలో ఆసియా జనాభా వేగంగా వృద్ధి చెందుతోంది.

Asian American: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసుల హవా.. చైనాకు భారత్ గట్టిపోటీ

అమెరికాపై ఆసియా జెండా

జనాభాలో అక్కడా భారత్‌, చైనాకు పోటీ

వాషింగ్టన్‌, డిసెంబరు 17: అమెరికాలో ఆసియా జనాభా వేగంగా వృద్ధి చెందుతోంది. మిగతా జాతులు, స్థానిక తెగలతో పోల్చితే ఆసియా పౌరుల ప్రాబల్యం అక్కడి నగర జీవితంలో శరవేగంగా విస్తరిస్తోంది. అందులోనూ, జనాభా విషయంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీలు పడే చైనా, భారత్‌లు అమెరికాలోనూ అదే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. అమెరికాలోని మెట్రో నగరాల్లో ఆసియా జనాభాలో గత పదేళ్ల కాలంలోనే 35.5 శాతం వృద్ధి కనిపించింది. 2020 జనగణన ఆధారంగా తీసిన లెక్కలు ఇవి. పెరిగిన జనవృద్ధితో ఆసియా సంతతి అమెరికా పౌరుల జనాభా 2.4 కోట్లకు చేరుకుంది. సమస్త అమెరికా మెట్రో జనాభాలో ఇది 7.2 శాతం. ఇందులో చెరో 40 లక్షలకు పైబడిన జనాభాతో భారత్‌, చైనా ముందు వరుసలో నిలిచాయి. డల్లాస్‌-ఫోర్ట్‌ వర్త్‌ మెట్రోప్లెక్స్‌ ప్రాంతం ప్రస్తుతం ఆసియావాసులకు స్వర్గంగా మారిందని అమెరికా జనగణన విభాగం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-12-18T07:33:54+05:30 IST