NRI: ఇంగ్లండ్‌, వేల్స్‌లో ఉంటున్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారే!

ABN , First Publish Date - 2022-11-04T23:41:53+05:30 IST

ఇంగ్లండ్, వేల్స్‌లో ప్రస్తుతం నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒక్కరు యూకే ఆవల జన్మించిన వారేనట. 2021 నాటి జనగణనలో ఈ విషయం వెల్లడైంది.

NRI: ఇంగ్లండ్‌, వేల్స్‌లో ఉంటున్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారే!

ఎన్నారై డెస్క్: ఇంగ్లండ్, వేల్స్‌లో ప్రస్తుతం నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒక్కరు యూకే ఆవల జన్మించిన వారేనట. 2021 నాటి జనగణనలో ఈ విషయం వెల్లడైంది. ఇలా యూకే ఆవల పుట్టిన వాళ్లల్లో అత్యధికులు భారత్‌కు చెందిన వారేనని తేలింది. అంతేకాకుండా.. భారత్‌లో పుట్టి ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో ఉంటున్న వారి సంఖ్య అంతకుమునుపటి జనగణన లెక్కలతో పోలిస్తే ఏకంగా 1.5 శాతం పెరిగింది. 2011 సెన్సెస్ ప్రకారం.. భారత్‌లో పుట్టి ఇంగ్లండ్, వేల్స్‌లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 6,94,148 కాగా..2011 సెన్సెస్ నాటికి ఇది 9,20,361కు చేరుకుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో మొత్తం 49.6 మిలియన్ల మంది ఉంటున్నారు. వీరిలో 83.2 శాతం మంది యూకేలోనే జన్మించారు. 16.8 శాతం మంది యూకే ఆవల పుట్టారు.

ఇక ఐరోపా సమాఖ్య దేశాల్లో పుట్టి బ్రిటన్‌కు మకాం మార్చిన వారి సంఖ్య 3.6 మిలియన్లు కాగా.. 6.4 మిలియన్ల మంది మాత్రం ఈయూ ఆవల పుట్టారు. ఇక ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో విదేశీమూలాలున్న వారిలో భారత సంతతి వారి తరువాత అత్యధికంగా రోమేనియా వారు ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో ఇర్లాండ్, ఇటలీ, బంగ్లాదేశ్, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అయితే.. ఈ జాబితాలోని తొలి పదిస్థానాల్లో ఎక్కడా అమెరికా లేకపోవడం గమనార్హం. ఇక పాస్‌పోర్టుల పరంగా చూస్తే..ఈ రెండు ప్రాంతాల్లోని సుమారు 1.3 శాతం మంది వద్ద పోలండ్ పాస్‌పోర్టు ఉంది. రోమేనియా పాస్‌పోర్టు గలవారు 0.9 శాతం మంది ఉండగా.. భారత్ పాస్‌పోర్టు కలిగిన వారి వాటా 0.6 శాతం.

Updated Date - 2022-11-04T23:44:58+05:30 IST