Rishi Sunak: యూకే ప్రధానిగా రిషి.. స్థానిక తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు
ABN , First Publish Date - 2022-10-25T19:48:24+05:30 IST
యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడంతో బ్రిటన్‌లోని తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.
యూకే ప్రధానిగా రిషి సునాక్(Rishi Sunak) ఎన్నికవడంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలున్న వారందరూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో రిషి కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ రిషి ప్రధాని(Britain PM) కావడం అమితానందాన్ని ఇచ్చింది. గత ఎన్నికల్లో ‘రెడీ ఫర్ రిషి’ పేరిట ప్రచార కార్యక్రమం ప్రారంభమైనప్పుడు బ్రిటన్‌లోని తెలుగు ప్రజలు ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా Sutton and Cheam constituencyలో తెలుగువాడైన నవీన్ సామ్రాట్ జలగడుగు ( కాంపెయిన్ కెప్టెన్ వాలంటీర్ ) ఆధ్వర్యంలో సోషల్ మీడియా క్యాంపెయిన్, ఫోన్ క్యాంపెయిన్‌తో పాటూ వివిధ ప్రసారమాధ్యమాలలో రిషి కోసం తన వంతుగా ప్రచారాన్ని చేశారు. రిషి పాలసీ, సిద్ధాంతాలపై పార్టీ మెంబర్స్‌కు వివిధ మార్గాల ద్వారా అవగాహన కల్పించారు.
Suttonలో పార్క్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి పార్టీ మెంబెర్స్, లోకల్ కౌన్సిలర్లు, జనరల్ పబ్లిక్‌తో కలిసి తమ మద్దతును రిషికి తెలియచేశారు. ఈ ఈవెంట్‌కు కన్సర్వేటివ్ పార్టీ మద్దతుదారులు ముకేశ్ రావు, చంద్ర ఆలపాటి, అనిల్ మాగులూరి, రామ్ కాట్రపాటి, పాల్గుణి మొదలగు వారు తమ సపోర్ట్‌ని తెలియచేశారు. రిషి పాలసీలు, బ్రిటన్‌కు రిషి ఎందుకు అవసరం అనేది ప్రజలకి చేరవేయటంలో చాలా చురుకుగా పనిచేశారు. రిషి విజయం సాధించేందుకు స్థానికులతో అనేక సమావేశాలు నిర్వహించారు. బ్రిటన్‌లో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దేశానికి రిషి అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలకు చెర వేసేందుకు చాలా కష్టపడ్డామని వివరించారు. ఈ రోజు రిషి విజయం చూసి చాల ఆనందపడుతున్నామని తెలిపారు. రిషి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ అక్టోబర్ 30న ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.