Nadendla Manohar: పవన్‌పై దాడి చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది: నాదెండ్ల
ABN , First Publish Date - 2022-10-30T18:32:37+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)పై దాడి చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)పై దాడి చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో విశాఖ పర్యటనలో రౌడీ మూకలను పంపారని తెలిపారు. విశాఖ గొడవతో పవన్‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని, ఆయన సంయమనంతో ఉండడం వల్ల ముప్పు తప్పిందన్నారు. ప్రభుత్వ కుట్ర లేకపోతే ఎయిర్‌పోర్టు ఘటనపై.. కేంద్ర బలగాలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని జగన్ (Jagan) గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. విశాఖలో జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని, వ్యవస్థలను జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. 98 మందిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఎంత దుర్మార్గమన్నారు. వైసీపీ (YCP) గర్జనకు లేని నిబంధనలను.. జనసేనకే ఎందుకు? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల ఒత్తిడితో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా.. అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. జగన్ దుర్మార్గపు ఆలోచనలకు పోలీసులు బలవుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.