Revanth Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవు
ABN , First Publish Date - 2022-11-09T20:38:07+05:30 IST
రాజ్‌భవన్, ప్రగతిభవన్ వ్యవహారం చిల్లర పంచాయితీ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: రాజ్‌భవన్, ప్రగతిభవన్ వ్యవహారం చిల్లర పంచాయితీ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. గవర్నర్ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, గవర్నర్ (Governor) కూడా ప్రతీదీ రాజకీయ కోణంలో చూడొద్దని రేవంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ పాత్రను గవర్నర్ పోషించాలనుకోవడం సరికాదని, గవర్నర్, సీఎం పంచాయితీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను కాపాడాలని కేసీఆర్ చూస్తున్నారని, కాంగ్రెస్‌ను వదిలిన ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ను వీడరని కేసీఆర్ (KCR) చెప్పగలరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవని రేవంత్‌రెడ్డి అన్నారు.