బూట్లు వేసుకున్న బాలుడికి ఏడుసార్లు గుండెపోటు.. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుతో చివరకు..
ABN , First Publish Date - 2022-11-04T20:41:05+05:30 IST
అంతవరకూ ఆ బాలుడు సంతోషంగా ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. చివరలో బూట్లు వేసుకుని బయటికి వచ్చాడు. అయితే కాసేపటికే విపరీతమైన నొప్పితో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుతో బాలుడికి ఏకంగా..
అంతవరకూ ఆ బాలుడు సంతోషంగా ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. చివరలో బూట్లు వేసుకుని బయటికి వచ్చాడు. అయితే కాసేపటికే విపరీతమైన నొప్పితో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుతో బాలుడికి ఏకంగా ఏడుసార్లు గుండెపోటు (Heart attack) వచ్చింది. చివరకు ఎవరూ ఊహించిన విధంగా విషాద ఘటన ( tragic incident) చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..
దక్షిణ అమెరికా (South America) సోపాలో రాష్ట్రం ఎనెంబి ప్రాంతానికి చెందిన ఎరాల్డో బార్బోసా, ఏంజెలిటా ప్రోయెంకా ఫుర్టాడో దంపతులకు లూయిజ్ మిగ్యుల్ ఫుర్టాడో బార్బోసా అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇలావుండగా, ఇటీవల ఓ రోజు ఈ కుటుంబం క్యాంపింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అప్పటికే సంతోషంగా ఆడుకుంటున్న లూయిజ్.. క్యాంపింగ్ వెళ్తుండడంతో మరింత సంతోషంగా రెడీ అయ్యాడు. చివర్లో బూట్లు వేసుకుని తల్లిదండ్రులతో పాటూ బయటికి వచ్చాడు. అయితే కాసేపటికే పాదాల్లో తీవ్రమైన నొప్పితో కేకలు పెట్టాడు. దీంతో చివరకు బూట్లు విప్పి చూడగా.. అందులో తేలు ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వాహనాల తనిఖీలో పట్టుబడ్డ ప్రేమికులు.. విచారించగా బయటపడ్డ మహిళ వివాహేతర సంబంధం..
చికిత్స అనంతరం అంతా ఇంటికి వచ్చారు. అయితే నొప్పి లేకపోవడంతో వైద్యులు ఇచ్చిన టాబ్లెట్లను బాలుడికి వేయడం మర్చిపోయారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత బాలుడు గుండె నొప్పితో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు మళ్లీ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. బాలుడు మొత్తం ఏడుసార్లు గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి సదరు ప్రాంతంలో ఇలాంటి కేసులు మొత్తం 54 నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం.. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిసింది.