Viral Video: అంతా చూస్తుండగా నడి రోడ్డుపైకి వచ్చిన భారీ అనకొండ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2022-05-21T21:22:54+05:30 IST

పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. అందులోనూ అనకొండకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా..

Viral Video: అంతా చూస్తుండగా నడి రోడ్డుపైకి వచ్చిన భారీ అనకొండ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. అందులోనూ అనకొండకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అడవిలో ఉండే విష సర్పాలు, జంతువులు కొన్నిసార్లు జన సంచారంలోకి రావడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలో ఓ భారీ అనకొండ కూడా అంతా చూస్తుండగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.


బ్రెజిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాదచారులు, వాహనాల రాకపోకలతో ఓ ప్రధాన రహదారి రద్దీగా ఉంటుంది. అదే సమయంలో ఓ భారీ అనకొండ ఉన్నట్టుండి రోడ్డుపైకి వస్తుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కొందరు వాహనాలను రోడ్డుపై ఆపి, అనకొండను ఆసక్తిగా గమనిస్తుంటారు. మరికొందరు ఈ ఘటనను మొత్తం తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి..


రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దూటుకుని రోడ్డుపై మెల్లిగా పాకుతూ వెళ్లడాన్ని అంతా అలా చూస్తూ ఉండిపోతారు. కాసేపటికి రోడ్డు పక్కన ఉన్న గడ్డి పొదల్లోకి వెళ్తుంది. అది ఎవరిపైనా దాడి చేయకపోవడంతో అంతా అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి..





Updated Date - 2022-05-21T21:22:54+05:30 IST