16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..

ABN , First Publish Date - 2022-06-17T00:48:11+05:30 IST

పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అలాంటి పెద్దలు బాధ్యత మరచిపోయి ప్రవర్తిస్తే.. పిల్లల జీవితం అంధకారమయం అవుతుంది. ఆడ పిల్లల..

16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..

పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అలాంటి పెద్దలు బాధ్యత మరచిపోయి ప్రవర్తిస్తే.. పిల్లల జీవితం అంధకారమయం అవుతుంది. ఆడ పిల్లల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. 16 ఏళ్ల కూతురికి ఓ తల్లి రహస్యంగా పెళ్లి చేయాలని చూసింది. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమైన పని తెలుసుకుని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఇజ్జత్‌నగర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ 16ఏళ్ల బాలికకు ఇటీవల వరసకు బావ అయ్యే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బంధువు కావడంతో ఆ యువకుడు కొన్నాళ్లు బాలిక ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెద్దలకు తెలీకుండా ప్రేమ వ్యవహారం నడిపారు. కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాలికకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూశారు. అయితే ఆమె గర్భవతి అని తెలియడంతో వివాహం చేసుకునేందుకు వారు నిరాకరించారు. శిశువును వదిలేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టాడు. ఈ క్రమంలో జూన్ 11న బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి.

103 ఏళ్ల వయసులోనూ ఓ వృద్దురాలి సాహసం.. Guinness World Records లో స్థానం..!


బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో బాలిక తల్లి.. ఇంట్లోనే ప్రసవం చేసింది. అనంతరం శిశువును సంచిలో వేసి, మురుగు కాలువలో పడేసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. మరుసటి రోజు రహస్యంగా వివాహం చేయించింది. అయితే పోలీసులు శిశువును రక్షించి, CWC (Child Welfare Centre) అధికారులకు అప్పగించారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి, బాలిక తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం బాలికను విచారించిన అనంతరం శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు CWC అధికారులు తెలిపారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.

Leave Letter లో ఓ ఉద్యోగి చెప్పిన కారణానికి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంత నిజాయితీ ఏంట్రా బాబూ అంటూ..

Updated Date - 2022-06-17T00:48:11+05:30 IST