పొరపాటున ఖాతాలోకి రూ.11 వేల కోట్లు.. కొద్ది గంటల్లోనే మాయం.. కానీ అతడు తెలివిగా చేసిన ఒక్క పనితో రూ.5 లక్షల లాభం..!
ABN , First Publish Date - 2022-09-17T01:04:08+05:30 IST
బ్యాంకు ఖాతాల్లోకి (Bank Account) పొరపాటున ఉన్నట్టుండి లక్షలు, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనే వార్తలు అప్పుడప్పుడూ వింటూ వింటాం. ఖాళీగా ఉన్న ఖాతాల్లోకి ఉన్నఫలంగా కోట్లు..
బ్యాంకు ఖాతాల్లోకి (Bank Account) పొరపాటున ఉన్నట్టుండి లక్షలు, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనే వార్తలు అప్పుడప్పుడూ వింటూ వింటాం. ఖాళీగా ఉన్న ఖాతాల్లోకి ఉన్నఫలంగా కోట్లు వచ్చి పడితే.. ఇక ఆ ఖాతాదారుడి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కొందరు అయోమయానికి గురైతే.. మరికొందరు అంతులేని ఆనందంతో పాటూ ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో అందులో కొంత మొత్తాన్ని ఖర్చు చేయడమో, లేక అప్పులు తీర్చుకోవడమో చేస్తుంటారు. చివరకు సదరు వ్యక్తికి బ్యాంకు నుంచి నోటీసులు (Bank notices) రావడం జరుగుతుంటుంది. ఇలాంటి వార్తలు గతంలో చాలా విన్నాం. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. పొరపాటున తన ఖాతాలోకి రూ.11 వేల కోట్లు వచ్చిపడ్డాయి. అయితే ఆ వ్యక్తి మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి.. ఒక్క పనితో రూ.5లక్షల లాభం పొందాడు. వివరాల్లోకి వెళితే...
గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన రమేష్ భాయ్ సాగర్ అనే వ్యక్తి.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు (Stock market investments) పెడుతుంటాడు. ఇదిలావుండగా, జూలై 26న అతడి బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.11,677 కోట్లు వచ్చిపడ్డాయి. ఇతడి స్థానంలో వేరే వారు ఉండి ఉంటే.. ఉక్కిరిబిక్కిరి అయ్యి ఉండేవారు. కానీ ఇతడు మాత్రం మెసేజ్ చూసినా ఎలాంటి భావోద్వేగానికీ లోనవలేదు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ చోటు చేసుకుంటుంటాయనే విషయం అతడికి తెలుసు. కొంత సేపు ఆగితే మళ్లీ నగదు మాయమవుతుందని గ్రహించాడు.
షాకింగ్ ఘటన.. కూతురి మృతదేహాన్ని ఉప్పుతో పూడ్చేసిన తండ్రి.. 44 రోజుల తర్వాత బయటకు తవ్వి తీసి..
అయితే ఆ డబ్బు నుంచి లాభం ఎలా పొందాలని ఆలోచించాడు. చివరకు అందులో రూ.2కోట్లను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టాడు. తద్వారా అతను కొద్ది గంటల్లోనే రూ.5.64 లక్షల లాభం పొందాడు. రాత్రి 8గంటల సమయంలో అతడి ఖాతాల్లో పడ్డ కోట్ల రూపాయలన్నీ.. మళ్లీ విత్‌డ్రా అయ్యాయి. అయితే అప్పటికే ఆ వ్యక్తి లాభంలో ఉన్నాడు. అనుకోకుండా వచ్చిపడిన డబ్బును సద్వినియోగం చేసుకుని.. లక్షల రూపాయల లాభం పొందిన రమేష్ భాయ్ గురించి, స్థానికంగా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.