Viral Video: అదృష్టం ఉంటే ఇలానే జరుగుతుంది.. పై నుంచి రైలు వెళ్లినా..

ABN , First Publish Date - 2022-11-13T10:23:34+05:30 IST

పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తూనే ఉంటారు. పట్టాలపై రైలు వస్తుందో లేదో ఒకటికి రెండు సార్లు గమనించిన తర్వాతే పట్టాలు దాటాలని చెబుతారు. కానీ..

Viral Video: అదృష్టం ఉంటే ఇలానే జరుగుతుంది.. పై నుంచి రైలు వెళ్లినా..

ఇంటర్నెట్ డెస్క్: పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తూనే ఉంటారు. పట్టాలపై రైలు వస్తుందో లేదో ఒకటికి రెండు సార్లు గమనించిన తర్వాతే పట్టాలు దాటాలని చెబుతారు. కానీ కొంత మంది అధికారుల మాటలను పెడచెవిన పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి ఘటనే తాజాగా ఒకటి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందంటే..

ట్రైన్ మిస్ అవుతుందనే కంగారో లేక ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆలోచనో తెలియదు కానీ రైలు వస్తుందో లేదో గమనించకుండానే బిహార్‌లో ఓ వ్యక్తి పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అతడు పట్టాలు దాటే క్రమంలోనే అటువైపుగా రైలు దూసుకొచ్చింది. దీంతో చేసేదేమీ లేక అతడు.. పట్టాల మధ్యలో పడుకుండిపోయాడు. ఈ నేపథ్యంలో రైలు అతడిపై నుంచి దూసుకెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో అతడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. రైలు వెళ్లిపోయాక.. పట్టాలపై నుంచి లేచిన అతడు.. నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచిస్తున్నారు.

Updated Date - 2022-11-13T10:23:36+05:30 IST